దేశంలో ఉగ్రవాదం పెరగడానికి కారణం బీజేపీయే: మంత్రి తలసాని
- సున్నితమైన అంశాలను బీజేపీ రాజకీయం చేస్తోంది
- పోలీసుల మనో స్థయిర్యం దెబ్బతీసేలా వ్యాఖ్యలు తగదు
- కాంగ్రెస్ పార్టీ పైనా విరుచుకుపడ్డ తలసాని
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపైనా ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. బ్యాలెట్ పద్ధతి బాగుంటుందని అంటున్న ఉత్తమ్, ఈవీఎంలు ఉన్నప్పుడు గెలవలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను ఆ పార్టీ కాపాడుకుంటే చాలని ఎద్దేవా చేశారు.