మీ కిచెన్‌లో ఈ 5 వస్తువులు ఉన్నాయా? వెంటనే మార్చేయాలంటున్న నిపుణులు!
- పసుపు స్క్రబ్బర్‌కు బదులు సహజ కొబ్బరి పీచు వాడాలని సూచన
- చెక్క బోర్డుకు బదులు స్టీల్ బోర్డు మేలని సలహా
- గీతలు పడిన నాన్‌స్టిక్ ప్యాన్ వాడొద్దని హెచ్చరిక
- వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టొద్దన్న నిపుణురాలు
- క్లీనర్‌కు బదులు వెనిగర్‌తో తెల్లటి మచ్చలు తొలగించొచ్చని వెల్లడి
వంటగదిలో ఏళ్ల తరబడి వాడుతున్న కొన్ని వస్తువులను మనం పెద్దగా పట్టించుకోం. పాడైపోయినా, గీతలు పడినా అలాగే వాడుతుంటాం. అయితే ఇలాంటి వాటిపై కూడా శ్రద్ధ పెట్టాలని పోషకాహార నిపుణురాలు రాశి చౌదరి సూచిస్తున్నారు. వంటగదిలో తరచూ ఉపయోగించే ఐదు వస్తువుల స్థానంలో కొన్ని సులభమైన మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు.
పాత్రలు తోమేందుకు ఉపయోగించే పసుపు రంగు కొబ్బరి పీచు స్క్రబ్బర్‌కు బదులుగా సహజమైన కొబ్బరి పీచుతో తయారైన స్క్రబ్బర్ వాడాలని రాశి సూచించారు. ప్లాస్టిక్ కలిసిన స్క్రబ్బర్లు వాడే సమయంలో చిన్న రేణువులు పాత్రలకు అంటుకునే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
కూరగాయలు కోసేందుకు ఉపయోగించే చెక్క బోర్డులకు బదులుగా స్టీల్ బోర్డులు వాడాలని రాశి చౌదరి సూచించారు. చెక్క బోర్డుపై పదేపదే కత్తితో కోయడం వల్ల చిన్న గాట్లు ఏర్పడతాయని, వాటిలో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుందని తెలిపారు.
గీతలు పడిన నాన్‌స్టిక్ ప్యాన్లను మాత్రం వాడకపోవడం మంచిదని ఆమె సూచించారు. పూత దెబ్బతిన్న ప్యాన్ నుంచి ఆ పదార్థాలు ఆహారంలో కలిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాటికి బదులుగా కాస్ట్ ఐరన్ ప్యాన్ వాడొచ్చని తెలిపారు.
వేడి ఆహారాన్ని నేరుగా ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టొద్దని కూడా సూచించారు. వేడి పదార్థాలను భద్రపరిచేందుకు స్టీల్ డబ్బాలు ఉపయోగించడం మంచిదని చెప్పారు.
కెటిల్, ట్యాప్‌లపై పేరుకునే తెల్లటి మచ్చలను తొలగించేందుకు బాత్‌రూమ్ క్లీనర్ వాడొద్దని సూచించారు. వాటి స్థానంలో తెల్ల వెనిగర్‌ను రాత్రంతా ఉంచి, మరుసటి రోజు శుభ్రం చేసుకోవచ్చని తెలిపారు.