తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్
- రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సంరంభం
- మూడు దశల్లో ఎన్నికలు
- మే 14న తుది దశ పోలింగ్
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపును మాత్రం లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాతే నిర్వహిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర ఎన్నికల సంఘం అనుమతివ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సమాయత్తమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల ప్రాతిపదికనే జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ తేదీ మే 6న జరుగుతుండగా, రెండో దశ వచ్చే నెల 10న, మూడో దశ వచ్చే నెల 14న జరగనున్నాయి.