ఏపీలో జిల్లాల వారీగా పోలింగ్ శాతం.. పురుషుల కంటే మహిళల ఓట్లే ఎక్కువ!
- 2014లో 78.41 శాతం పోలింగ్
- ఈసారి 79.64 శాతం పోలింగ్ నమోదు
- ప్రకాశం జిల్లాలో దాదాపు 86 శాతం పోలింగ్ నమోదు
వీరిలో 1,55,45,211 మంది పురుషులు, 1,57,87,759 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓటు వేయడం గమనార్హం. 2014లో 78.41 శాతం పోలింగ్ నమోదు కాగా... ఈసారి పోలింగ్ శాతం మరింత పెరిగింది. జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం వివరాలు..
- శ్రీకాకుళం - 75.14
- విజయనగరం - 80.68
- విశాఖపట్నం - 71.81
- తూర్పుగోదావరి - 80.08
- పశ్చిమగోదావరి - 82.19
- కృష్ణా - 81.12
- గుంటూరు - 82.37
- ప్రకాశం - 85.93
- నెల్లూరు - 76.68
- కడప - 77.21
- కర్నూలు - 77.68
- అనంతపురం - 81.90
- చిత్తూరు - 81.03