సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ఆఫ్రికా దేశంలో '96' రీమేక్ షూటింగ్
- హీరోగా ప్రముఖ నిర్మాత తనయుడు
- పోస్ట్ ప్రొడక్షన్ దశలో శర్వానంద్ సినిమా
* గతంలో పలు చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రం సహదేవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ కుర్రాడు హీరోగా నటించిన 'ఎవడూ తక్కువ కాదు' చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. రఘు జయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక జైన్ హీరోయిన్ గా నటించింది.
* శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. మే 31న విడుదల కానున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శిన్ హీరోయిన్లుగా నటించారు.