చిత్తూరు టీడీపీ నేత సీకే బాబు ఇంట్లో ఎన్నికల స్క్వాడ్ సోదాలు!
- సీకే బాబు ఇంట్లో మద్యం, నగదు ఉన్నట్లు సమాచారం
- తనిఖీలు చేపట్టిన అధికారులు, పోలీసులు
- అనంతపురంలో జేసీ కాలేజీలో ఇప్పటికే తనిఖీలు
ఒకటో పట్టణ సీఐ శ్రీధర్, ఎలక్షన్ స్క్వాడ్ అధికారి పార్థసారథితో పాటు పోలీసులు సీకే బాబు ఇంట్లో తనిఖీలు చేశారు. కాగా, దాదాపు అర గంట పాటు సాగిన ఈ తనిఖీల్లో ఎలాంటి నగదు, మద్యం లభించలేదు. దీంతో ఎన్నికల స్క్వాడ్ అధికారులు, పోలీసులు వెనుదిరిగారు. ఇటీవల టీడీపీ అనంతపురం నేత జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ఓ కాలేజీలో కూడా పోలీసులు సోదాలు జరిపారు.