ఆ నిర్మాత ‘ఛాన్స్ ఇస్తా.. నాతో సన్నిహితంగా ఉంటావా’ అని అడిగాడు!: హీరోయిన్ శ్రుతి మరాఠే
- మొదట ప్రొఫెషనల్ గానే మాట్లాడాడు
- హీరోను కూడా అడిగావా? అని ప్రశ్నించా
- ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ పేజీలో పోస్ట్ చేసిన నటి
తాను 16 ఏళ్లకే సినీ పరిశ్రమలోకి వచ్చానని శ్రుతి తెలిపారు. ‘నటీనటుల జీవితాలు చాలా హాయిగా సాగిపోతుంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు. నా కెరీర్ తొలినాళ్లలో ఓ దక్షిణాది సినిమాలో నటించే అవకాశం వచ్చింది. సినిమా కోసం దర్శకుడు బికినీ వేసుకోవాలన్నాడు. ఎందుకు? ఏమిటి? లాంటి ప్రశ్నలు వేయకుండా సినిమా కోసం ఒప్పుకొన్నా. కొన్నేళ్ల తర్వాత మరాఠీ షోలతో నాకు బాగా పాప్యులారిటీ వచ్చింది. కానీ ఆ సన్నివేశం చూసిన కొందరు నన్ను ఎగతాళి చేశారు’ అని గుర్తుచేసుకున్నారు. అలాంటి విమర్శలు నటీనటుల ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు. ‘బుధియా సింగ్: బోర్న్ టు రన్’ చిత్రంతో శ్రుతి బాలీవుడ్లోకి అడుగుపెట్టారు.