రంగస్థల నటుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన అశోక్ కుమార్, ఆ తరువాత బుల్లితెరపై .. వెండితెరపై కూడా రాణించారు. నారదుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు.

"నేను బాగా నటిస్తాననీ .. నాకు నటనపట్ల ఆసక్తి ఉందని తెలిసి, మాగంటి రవీంద్రనాథ్ చౌదరిగారు నన్ను వెంటబెట్టుకు తీసుకెళ్లి దర్శకుడు విజయ బాపినీడుకి పరిచయం చేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'పున్నమి చంద్రుడు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమయ్యాను. ఆ తరువాత చేసిన 'తెనాలి రామకృష్ణ' ధారావాహిక నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ .. అక్కినేని నాగేశ్వరరావు వంటి హేమా హేమీలతో కలిసి నటించే అవకాశం రావడం నేను చేసుకున్న అదృష్టం. ఆ ఇద్దరితో నాకు గల సాన్నిహిత్యాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను" అని చెప్పుకొచ్చారు.