చిరూ .. కొరటాల సెట్స్ పైకి వెళ్లేది అప్పుడేనట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరూ .. కొరటాల సెట్స్ పైకి వెళ్లేది అప్పుడేనట!

  • ముగింపు దశలో 'సైరా'
  • జూలై నుంచి కొరటాల ప్రాజెక్ట్ 
  • ఒక నాయికగా శ్రుతి హాసన్      
చిరంజీవి తాజా చిత్రంగా 'సైరా' రూపొందుతోంది. చారిత్రక నేపథ్యంతో కూడిన సినిమా కావడంతో, ప్రత్యేకంగా వేసిన భారీ సెట్స్ లో ఈ సినిమా షూటింగు కొనసాగుతోంది. ఈ సినిమా తరువాత ఆయన కొరటాలతో సెట్స్ పైకి వెళతారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని మెగా అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

'సైరా' షూటింగు జూన్ తో పూర్తవుతుందట. జూలై నుంచి చిరూ .. కొరటాల కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుందనేది తాజా సమాచారం. చిరంజీవి ఎప్పుడు తీరికగా వుంటే అప్పుడు ఆయనను కొరటాల కలిసి, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్లారిటీ ఇస్తూ వస్తున్నాడట. అలాగే ఒకసారి షూటింగు మొదలైతే, ఎక్కడా పెద్ద గ్యాప్ రాకుండా డిసెంబర్ నాటికి షూటింగు పూర్తయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నాడనీ .. ఒక కథానాయికగా శ్రుతి హాసన్ ను ఎంపిక చేశారనే వార్తలు షికారు చేస్తున్నాయి. 
chiranjeevi
Koratala Siva

More Telugu News