తూచ్.. మేం వాడింది ఎఫ్-16 కాదు.. అమెరికా ఆగ్రహంతో మాటమార్చిన పాక్
- కూలింది చైనా తయారీ అయిన జేఎఫ్-17 యుద్ధ విమానం
- అమెరికా ఆగ్రహంతో బుకాయించిన పాక్
- కూలింది ఎఫ్-16 విమానమేనన్న భారత వాయుసేన చీఫ్
దీంతో తత్తరపడిన పాక్ మాటమార్చింది. తామసలు ఎఫ్-16 యుద్ధ విమానాన్ని వాడలేదని, చైనా తయారీ అయిన జేఎఫ్-17 యుద్ధ విమానాన్ని వాడామని వివరణ ఇచ్చింది. చైనాతో కలిసి తాము తయారుచేసుకున్న జేఎఫ్-17 విమానంతోనే తాము అభినందన్ మిగ్ విమానాన్ని కూల్చివేశామని స్పష్టం చేసింది. ఇందుకోసం సీఎన్ఎన్ ప్రచురించిన ఓ వార్తా కథనాన్ని తనకు అనుకూలంగా మలచుకుంది. భారత వాయుసేనకు చెందిన మిగ్ -21 దాడిలో చైనా తయారీ అయిన జేఎఫ్-17 యుద్ధ విమానం ఒకటి కూలిపోయిందని సీఎన్ఎన్ ప్రచురించింది. పాక్ బుకాయింపును భారత వాయుసేన చీఫ్ ధనోవా కొట్టిపడేశారు. తాము కూల్చింది ఎఫ్-16 యుద్ధ విమానమేనని తేల్చిచెప్పారు.