కలిసిన భిన్నధ్రువాలు... ఏడాది వ్యవధిలో ట్రంప్, కిమ్ రెండో భేటీ!
- వియత్నాంలో ఇరు దేశాధినేతల భేటీ
- ఏడాది వ్యవధిలో రెండోసారి సమావేశం
- తమ భేటీని ప్రపంచం స్వాగతించిందన్న కిమ్
ఆపై కిమ్ మాట్లాడుతూ, ఈ సమావేశం గొప్ప ఫలితాన్ని ఇస్తుందన్న ఆశాభావంతో ఉన్నట్టు తెలిపారు. తమ భేటీని ప్రపంచం స్వాగతిస్తోందని అన్నారు. ఆపై ట్రంప్ మాట్లాడుతూ, గతంలో జరిగి న చర్చల కంటే, ఈ సమావేశం మెరుగ్గా సాగిందని తెలిపారు. కాగా, గత సంవత్సరం జూన్ 12న సింగపూర్‌లోని క్యాపెల్లా హోటల్ లో వీరిద్దరూ సమావేశమైన సంగతి తెలిసిందే. ఆపై ఖండాంతర క్షిపణి ప్రయోగాలను, అణు పరీక్షలనకు కిమ్ సర్కారు నిలిపివేసింది.