తెలుగు తెరపై కుటుంబ కథా చిత్రాలను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకులలో కోడి రామకృష్ణ ఒకరు. 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాతో దర్శకుడిగా ఆయన పరిచయం జరిగింది. మధ్యతరగతి జీవితాలను .. అందులోని ఒడిదుడుకులను కథా వస్తువుగా ఎంచుకుని, ఆయన ప్రేక్షకులను మెప్పించారు. భక్తితో కూడిన చిత్రాలను సైతం తనదైన శైలిలో తెరకెక్కించి మంత్రముగ్ధులను చేసిన ఘనత ఆయన సొంతం. 'అమ్మోరు' .. 'అరుంధతి' సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి.

అలాంటి కోడి రామకృష్ణ  తీవ్రమైన అస్వస్థతకి లోను కావడంతో, కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్ - గచ్చీబౌలీలోని ఏఐజీ హాస్పిటల్లో చేర్పించినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఆయనకి వెంటిలేటర్ పై చికిత్స అందుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో పెరాలసిస్ రావడంతో కొంతకాలంపాటు బాధపడిన ఆయన ఆ తరువాత కోలుకున్నారు.  అదే విధంగా ఆయన మళ్లీ కోలుకుని తిరిగి రావాలని ఆశిద్దాం.