త్రివిక్రమ్ మూవీలో బన్నీ తల్లి పాత్రలో నగ్మా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రివిక్రమ్ మూవీలో బన్నీ తల్లి పాత్రలో నగ్మా?

  • బన్నీతో త్రివిక్రమ్ మూవీ 
  • కథానాయికగా పూజా హెగ్డే 
  • త్వరలోనే సెట్స్ పైకి
త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ కి తుదిమెరుగులు దిద్దుతోన్న త్రివిక్రమ్, నటీనటుల ఎంపిక ప్రక్రియపై దృష్టి పెట్టాడు. ఇప్పటికే కథానాయికగా పూజా హెగ్డేను తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అటు త్రివిక్రమ్ తోను .. ఇటు బన్నీతోను పూజా హెగ్డేకి ఇది రెండవ సినిమా కావడం విశేషం.

ఈ సినిమాలో బన్నీ తల్లి పాత్రకిగాను నగ్మాను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఈ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండటంతో, నగ్మాతో చేయిస్తే బాగుంటుందని భావించిన త్రివిక్రమ్ ఆమెను తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. నిన్నటి తరంలో అందాల కథానాయికగా ఒక వెలుగు వెలిగిన నగ్మా, తెలుగు తెరపై కనిపించక చాలా కాలమే అయింది. అందువలన కొత్తగా వుంటుందనే ఉద్దేశంతోనే ఆమె రీ ఎంట్రీకి త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. త్వరలో నటిగా తన రీ ఎంట్రీ ఉంటుందని ఇటీవల ఒక వేదికపై నగ్మా చెప్పడం, ఈ వార్తకి మరింత బలాన్ని చేకూరుస్తోంది.
allu arjun
pooja hegde
nagma

More Telugu News