నిర్మాతగా కాజల్ .. భాగస్వామిగా తమన్నా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిర్మాతగా కాజల్ .. భాగస్వామిగా తమన్నా?

  • సొంత బ్యానర్ ఆలోచనలో కాజల్ 
  • ఆల్రెడీ కథ చెప్పిన ప్రశాంత్ వర్మ
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్  
స్టార్ హీరోలు చిత్ర నిర్మాణం పట్ల ఆసక్తిని చూపుతున్నారు. ఇక కొత్తగా వచ్చిన హీరోలు కాస్త కుదురుకోగానే సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక నిన్న మొన్నటి వరకూ హీరోయిన్స్ వేరే వ్యాపారాలపై పెట్టుబడులు పెడుతూ వచ్చారు. ఇప్పుడు వాళ్లు కూడా నిర్మాతలుగా మారుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి కాజల్ చేరనున్నట్టు తెలుస్తోంది. కేఏ మూవీస్ బ్యానర్ పై ఓ సినిమాను నిర్మించడానికి కాజల్ రెడీ అవుతోందట. ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా తమన్నా ఉండనున్నట్టుగా తెలుస్తోంది. కాజల్ .. తమన్నా ఇద్దరూ కూడా మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. కాజల్ నిర్మించే ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఆల్రెడీ ఆయన కథ చెప్పడం .. కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. కాజల్ నిర్మాతగా కంటిన్యూ అవుతుందా? లేదా? అనేది ఈ సినిమా ఫలితంపై ఆధారపడి వుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 
kajal
tamannah

More Telugu News