చంద్రబాబు లాంటి మనిషిని మనం ఏమనాలి?: వైఎస్ జగన్

  • చంద్రబాబు తన సినిమా-2లో డైలాగ్స్ కొడుతున్నారు
  • బాబును ‘అన్నా’ అనాలా? ‘దున్నా’ అనాలా?
  • ఎన్నికలప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తొస్తున్నారు!
ఏపీలో ఎన్నికలు వస్తున్నాయంటే పోలీసులతో గూండాగిరి చేయిస్తారని, వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆ పార్టీ అధినేత జగన్ ఆరోపించారు. తిరుపతిలో నిర్వహిస్తున్న ‘సమర శంఖారావం’లో ఆయన మాట్లాడుతూ, ఎల్లో మీడియా గురించి చెప్పనక్కర్లేదని, ఎల్లో మీడియా సాయంతో దొంగ సర్వేలు వేయిస్తారని, 59 లక్షల దొంగ ఓట్లను నమోదు చేయించారని ఆరోపించారు.

వచ్చే ఎన్నికలు న్యాయానికి- అన్యాయానికి; ఆప్యాయతకు- డబ్బుకు మధ్య జరిగేవిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన విరుచుకుపడ్డారు. రైతులకు ఆర్థిక సాయమంటూ డ్రామాలాడుతున్నారని, వారి జీవితాలతో ఆటలాడుతున్నారని విమర్శించారు. ఎన్నికలు మూడు నెలల్లో ఉండటంతో చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొచ్చారని, పెన్షన్ ను రెండు వేల రూపాయలకు పెంచారని,   ఇప్పుడు తన సినిమా-2లో డైలాగ్స్ కొడుతున్నారని, అధికారంలో ఉండగా చంద్రబాబుకు బీసీలు గుర్తుకురారని, ఇప్పుడు బీసీ డిక్లరేషన్ అంటూ డ్రామాలాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు లాంటి మనిషిని మనం ఏమనాలి? అన్నా’ అనాలా? ‘దున్నా’ అనాలా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
YSRCP
jagan
Telugudesam
Chandrababu
cm

More Telugu News