చంద్రబాబు ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తా!: దేవినేని అవినాశ్
- నేడు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు
- హాజరు కానున్న ఏపీ సీఎం
- గుడివాడ లేదా నూజివీడు సీటుపై అవినాశ్ కన్ను
ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరవుతారని తెలిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేయడం తన కర్తవ్యమన్నారు. యువతను చైతన్యవంతులను చేసి పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ ముందున్న లక్ష్యమని వ్యాఖ్యానించారు. గుడివాడ లేదా నూజివీడు అసెంబ్లీ సీటును దేవినేని అవినాశ్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.