పెద్ద పులి సుందరికి విముక్తి.. కాపలాగా ఏనుగులు రాజ్‌కుమార్, మహేంద్ర
- రెండు నెలలుగా బందీగా ఉన్న సుందరి
- ఆగ్రహం వ్యక్తం చేసిన లుల సంరక్షణ సంస్థ
- గ్రామాల్లోకి వెళ్లకుండా ఏనుగులతో పహారా
గత రెండు నెలలుగా బోనులో బందీగా ఉన్న సుందరిని త్వరలోనే అనుగుల్ జిల్లాలోని సాతోకోసియా అడవుల్లో విడిచిపెట్టనున్నట్టు అటవీశాఖ మంత్రి బిజయ్‌శ్రీ రౌత్రాయ్ తెలిపారు. పులిని అడవిలో విడిచిపెట్టాక దానికి కాపలాగా రాజ్‌కుమార్, మహేంద్ర అనే ఏనుగులు కాపలాగా ఉంటాయని పేర్కొన్నారు. అటవీ సిబ్బంది ఈ ఏనుగులపై సంచరిస్తూ సుందరిపై నిఘా పెడతారని మంత్రి వివరించారు.