జమ్మలమడుగు అసెంబ్లీ స్థానంపై చంద్రబాబు దృష్టి.. నేడు స్పష్టత వచ్చే అవకాశం!
- ఆది, రామసుబ్బారెడ్డిలలో ఒకరికి కట్టబెట్టే యోచన
- అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అంటున్న నేతలు
- నేడు చంద్రబాబుతో భేటీ
సీఎం చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ ఇరువురు నేతలూ చెబుతున్నప్పటికీ తాము కోరిన స్థానాల విషయంలో మాత్రం పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై సీఎం చంద్రబాబుతో భేటీ అయిన ఇరువురు నేతలు.. నేటి సాయంత్రం మరోసారి భేటీకి సిద్ధమవుతున్నారు. ఈ భేటీతో ఎవరు ఏ స్థానానికి పోటీ చేస్తారనే విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.