మాకు మంత్రి పదవులు ఇస్తారా.. చస్తారా?: సీఎం కమల్‌నాథ్‌కు బీఎస్పీ హెచ్చరిక
- కర్ణాటకలో ఏమవుతుందో చూస్తున్నారుగా
- రాష్ట్రంలో పార్టీ బలంగా ఉండాలంటే మాకు పదవులు ఇవ్వాల్సిందే
- తేల్చి చెప్పిన బీఎస్పీ ఎమ్మెల్యే రమాబాయి
తాజాగా మధ్యప్రదేశ్ బీఎస్పీ ఎమ్మెల్యే రమాబాయి అహిర్వార్ మాట్లాడుతూ.. బీఎస్పీ ఎమ్మెల్యేలు ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనన్నారు. తమకు పదవులు ఇవ్వకుంటే మిగతా వారు కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారని అన్నారు. అందరినీ సంతోషపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ బలంగా ఉండాలని సీఎం కమల్‌నాథ్ కనుక కోరుకుంటే తొలుత తాము బలంగా ఉండాలని, అందుకోసం తమకు మంత్రి పదవులు ఇవ్వాలని రమాబాయి తేల్చిచెప్పారు. మంత్రి పదవులు ఇవ్వకుంటే కనుక కర్ణాటక లాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.