శబరిమల పవిత్రత కోసం... రేపు మహా ఉపవాసం!
- హైదరాబాద్, ఇందిరాపార్క్ వద్ద దీక్ష
- అన్ని కలెక్టరేట్ల వద్దా నిరసనలు
- గవర్నర్ ను కలవనున్న వివిధ సంఘాల ప్రతినిధులు
ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని కలెక్టరేట్ కార్యాలయాల ముందు అయ్యప్ప భక్తులు శాంతియుత నిరసనలను తెలియజేయాలని, కలెక్టర్లకు వినతిపత్రాలను సమర్పించాలని సూచించారు. తాము రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసి మెమొరాండం అందిస్తామని రామరాజు మీడియాకు తెలిపారు. భక్తుల మనోభావాలను గౌరవించి, శబరిమలలో మహిళల ప్రవేశాన్ని నిరోధించేలా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ మహా ఉపవాసంలో వీహెచ్పీతో పాటు శబరిమల శ్రీ అయ్యప్ప సేవా సమాజం, శబరిమల ఐక్యవేదిక తదితర సంస్థలు పాల్గొంటాయని తెలిపారు.