Uttar Pradesh: దక్షిణ ధ్రువంపై ఉత్తరప్రదేశ్‌ ఐపీఎస్‌ అధికారిణి

షార్ట్స్‌లో చూడండి
దక్షిణ ధ్రువంపై భారత్‌ జెండాపాతి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు ఉత్తరప్రదేశ్‌ ఐపీఎస్‌ అధికారిణి. ఇండో-టిబెటిన్‌ బోర్డర్‌ పోలీస్‌ విభాగంలో డీఐజీగా పనిచేస్తున్న అపర్ణ కె.ఆర్‌ ఈనెల 13వ తేదీన దక్షిణ ధ్రువానికి చేరుకున్నారని డెహ్రాడూన్‌లోని ఐటీబీపీ నార్త్‌ర్న్‌ ఫ్రాంటియర్‌ ప్రధాన కార్యాలయం ఓ ప్రకటలో తెలిపింది. 2002 యూపీ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారిణిగా అపర్ణ ఎన్నికయ్యారు. దక్షిణ ధ్రువానికి చేరుకున్న తొలి ఐపీఎస్‌ అధికారిణిగా అపర్ణ రికార్డు సృష్టించారని ఐటీబీపీ కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది.
Go Back to Shorts
Uttar Pradesh

More Telugu News