రూ. 150 కోసం తండ్రిని పొడిచి చంపిన బాలుడు!
- కుమారుడికి డబ్బులు ఇచ్చేందుకు తండ్రి నిరాకరణ
- ఆగ్రహంతో కత్తితో పొడిచిన బాలుడు
- ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
కత్తితో తండ్రిపై దాడిచేసి పలుమార్లు విచక్షణ రహితంగా పొడిచి పారిపోయాడు. తీవ్ర గాయాలతో కుప్పకూలిన భర్తను అతడి భార్య వెంటనే ఆసుపత్రికి తరలించింది. అయితే, మార్గమధ్యంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు.