బైక్ ను ఢీకొన్న కారు... ఫ్లయ్ ఓవర్ పై నుంచి కిందపడిన యువతి దుర్మరణం!
- న్యూఢిల్లీ బారాపుల్లా ఫ్లయ్ ఓవర్ పై ఘటన
- పెళ్లికి వెళ్లి వస్తున్న యువ జంట
- కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
పదవీ విరమణ చేసిన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ నడుపుతున్న ఓ కారు ఢీకొనడంతో ఆ వేగానికి బైక్ పై కూర్చుని ఉన్న యువతి, ఫ్లయ్ ఓవర్ పై నుంచి కిందపడింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినా, ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో యువతి భర్త తల, కాళ్లకు గాయాలు అయ్యాయి. కేసును నమోదు చేసుకున్నామని, కారును నడిపిన వ్యక్తిని అరెస్ట్ చేశామని ఢిల్లీ సౌత్ ఈస్ట్ డిప్యూటీ కమిషనర్ చిన్మయ్ బిస్వాల్ తెలిపారు.