నిమ్మకూరుకు మేమెంతో రుణపడి ఉంటాం..మాకు ఎంతో ఇచ్చిన ఊరిది: నటుడు కల్యాణ్ రామ్
- ఆడియో వేడుక ఇక్కడ నిర్వహించలేకపోయాం
- ఇక్కడి బంధువులను కలవాలని వచ్చాం
- ‘హ్యాట్సాఫ్ బాబాయ్’ అన్న కల్యాణ్ రామ్
ఎన్టీఆర్ జీవితం గురించి అందరికీ తెలుసు కానీ, ఆయన కుటుంబంలో ఏం జరిగింది, మా తాతయ్యకు నాయనమ్మ బసవతారకం ఎంత తోడూనీడగా ఉన్నారు, ఎంతగా ప్రభావితం చేశారు.. వంటి అంశాలతో ‘యన్.టి.ఆర్’ కథ ఉంటుందని చెప్పారు. ఈ చిత్రం గొప్ప విజయం సాధించబోతోందనడంలో ఎటువంటి అనుమానం లేదని, మనకు పండగ మూడురోజుల ముందే వస్తోందని, ఈ నెల 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని అన్నారు.