ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ షాక్.. పార్టీ నేత హెచ్ఎస్ ఫూల్కా రాజీనామా

  • ట్విట్టర్ ద్వారా తెలిపిన ఫూల్కా
  • మరోసారి ఆలోచించమన్న కేజ్రీవాల్
  • నేడు మీడియా సమావేశం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. పంజాబ్‌కు చెందిన ఆ పార్టీ నేత, సీనియర్ అడ్వకేట్ హెచ్ఎస్ ఫూల్కా పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాజీనామా విషయంలో పునరాలోచించుకోవాలని కేజ్రీవాల్ తనను కోరారని అయితే, తాను ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నానని పేర్కొన్నారు.

‘‘ఆమ్ ఆద్మీ పార్టీకి నేను రాజీనామా చేశాను. ఆ లేఖను కేజ్రీవాల్‌కు అందించాను. రాజీనామా విషయంలో నన్ను పునరాలోచించుకోవాలని అడిగారు. అయితే, ఇప్పటికే తాను ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు ఆయనకు వివరించా’’ అని ఫూల్కా ట్విట్టర్ ద్వారా తెలిపారు. నేటి సాయంత్రం నాలుగు గంటలకు మీడియా సమావేశం నిర్వహించి రాజీనామాకు గల కారణాలు, భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తానని  ఫూల్కా తెలిపారు.
Go Back to Shorts
HS Phoolka
Aam Aadmi Party
Punjab
Arvind Kejriwal

More Telugu News