లోక్ సభ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే...: కేటీఆర్ జోస్యం

  • మరో మూడు నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు
  • యూపీఏకు 100, ఎన్డీయేకు 150 సీట్లు దాటవు
  • అందుకే ప్రాంతీయ పార్టీల కూటమి 
మరో మూడు నాలుగు నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏకు 100 సీట్లు దాటే పరిస్థితి లేదని, ఎన్డీయేకు 150 సీట్లు కూడా రావని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జోస్యం చెప్పారు. కూకట్ పల్లిలో జరిగిన టీఆర్ఎస్ విజయోత్సవ సభలో మాట్లాడిన ఆయన, బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటములు ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, ఈ కారణంతోనే వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను కూడగట్టే పనిలో కేసీఆర్ నిమగ్నమై ఉన్నారని అన్నారు. తెలంగాణలోని 16 స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే, ఢిల్లీని మనమే శాసించే పరిస్థితి వస్తుందని, ప్రధాని అభ్యర్థిని కూడా నిర్ణయించే శక్తి వస్తుందని అన్నారు. అప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సకాలంలో, సక్రమంగా తెచ్చుకోవచ్చని చెప్పారు.
Go Back to Shorts
KTR
Elections
Lok Sabha
Kukatpalli
NDA
UPA

More Telugu News