కొత్త రాజధానికి రూ.5 లక్షల కోట్లు కావాలని అప్పుడే చెప్పా.. అమరావతితో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి!: చంద్రబాబు
- ఆంధ్రాను 617 అవార్డులు వరించాయి
- అమరావతి తొలిదశకు రూ.51 వేల కోట్లు అవసరం
- రాజధాని పూర్తయ్యేందుకు 20 ఏళ్లు పడుతుంది
ఓ రాజధాని ఏర్పాటు అయ్యేందుకు 20 ఏళ్లు పడుతుందని చెప్పారు. అమరావతి తొలిదశ పనులకు అవసరమైన నిధుల్లో రూ.40,000 కోట్లకు పైగా సమీకరించుకున్నామనీ, పనులు సైతం శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. అమరావతి నిర్మాణంతో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలుగా గుర్తింపు పొందిన విట్, ఎస్ఆర్ఎమ్, అమృత వర్సిటీ వంటి సంస్థలు ఇప్పటికే అమరావతిలో తమ క్యాంపస్ లను ఏర్పాటు చేశాయని చంద్రబాబు గుర్తుచేశారు.
అమరావతిలో ఇంటర్నేషనల్ స్కూల్స్, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల స్థాపనకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ఏపీలో ఆరోగ్య, విద్యా రంగాల్లో దేశానికే హబ్ గా మారుస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వానికి వేర్వేరు రంగాల్లో ఇప్పటివరకూ 617 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయని వెల్లడించారు.