తెలంగాణ భవన్ లో కేటీఆర్ ని కలిసిన యాంకర్ సుమ

  • కేటీఆర్ కు అభినందనలు తెలిపిన సుమ   
  • ఓ మంచి పని కోసం ఆయన మద్దతు అడిగా
  • సమయం వచ్చినప్పుడు వివరాలు వెల్లడిస్తా
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రముఖ యాంకర్ సుమ కలిశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ ని కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఓ మంచి పని కోసం ఆయన మద్దతు అడిగానని, సమయం వచ్చినప్పుడు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు కేటీఆర్ కు అభినందనలు తెలిపానని చెప్పారు. 
Go Back to Shorts
KTR
TRS
anchor
suma
telangana bhavan

More Telugu News