బీజేపీ కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
- హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయానికి వచ్చిన ప్రీతిరెడ్డి
- పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో భేటీ
- కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీని కలిసిన మల్లారెడ్డి కుటుంబం
ఇటీవల తన కుటుంబంతో కలిసి మల్లారెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన విషయం తెలిసిందే. తాజాగా, ఆయన కోడలు బీజేపీ కార్యాలయానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రీతిరెడ్డి రెండు రోజుల క్రితం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో కూడా సమావేశమయ్యారు.