ఏపీ హైకోర్టుపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు
- హైకోర్టు నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుందని ప్రశ్నించిన సీఎం
- జనవరి 22 నాటికి పూర్తవుతుందన్న నిర్మాణ సంస్థ
- క్యాంపు కార్యాలయంలో కోర్టు హాళ్లను సిద్ధం చేస్తున్న అధికారులు
హైకోర్టు పూర్తయ్యేంత వరకు సీఎం క్యాంపు కార్యాలయంలో తాత్కాలిక హైకోర్టును ఏర్పాటు చేయాలని, స్టేట్ గెస్ట్ హౌస్ ను పాలనా సిబ్బందికి కేటాయించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో, క్యాంపు కార్యాలయంలో కోర్టు హాళ్లను సీఆర్డీయే అధికారులు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. నేలపాడు గ్రామంలో హైకోర్టు భవనాన్ని ఎల్ అండ్ టీ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.