శబరిమలలో మళ్లీ టెన్షన్.. టెన్షన్.. పంబ వద్ద 11 మంది మహిళలను అడ్డుకున్న భక్తులు!
- ఆలయంలోకి వెళ్లితీరుతామన్న మహిళలు
- ఇంకా ఆలయానికి రానున్న 39 మంది
- భారీగా పోలీసుల మోహరింపు
అంతేకాదు.. వీరిలో 11 మంది ఇప్పటికే పంబ వద్దకు చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడే ఆందోళన చేస్తున్న పలువురు భక్తులు వీరిని అడ్డుకున్నారు. ఆలయంలోకి వీరిని వెళ్లనివ్వబోమని స్పష్టం చేశారు. మరోవైపు పరిస్థితి చేయిదాటకుండా కేరళ ప్రభుత్వం ఆలయ పరిసరాలతో పాటు వెళ్లే మార్గంలోనూ భారీగా పోలీసులను మోహరించింది. శబరిమల అయ్యప్పస్వామిని 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు దర్శించుకోవచ్చని ఈ ఏడాది సెప్టెంబర్ 28న ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4:1 మెజారిటీతో తీర్పు ఇచ్చింది.