కేసీఆర్ పై వ్యతిరేకత ఉంది.. అలాంటప్పుడు టీఆర్ఎస్ ఎలా గెలిచింది?: కొండా సురేఖ
- అందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పెట్టారు
- ఒక్కో నియోజకవర్గంలో రూ.50 కోట్లు వెచ్చించారు
- టీఆర్ఎస్ పై మండిపడ్డ కొండా దంపతులు
తెలంగాణ అంతటా కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందనీ, అలాంటప్పుడు టీఆర్ఎస్ ఎన్నికల్లో ఎలా గెలుపొందిందని ప్రశ్నించారు. చింతమడక గ్రామంలోనే సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌ను ప్రజలు ఘోరావ్ చేసిన విషయాన్ని సురేఖ గుర్తుచేశారు. టీఆర్ఎస్ నేతలు ఒక్కో నియోజకవర్గంలో రూ.30 నుంచి రూ.50 కోట్ల వరకూ ఖర్చు పెట్టారని ఆమె ఆరోపించారు.
కాంగ్రెస్ నేతలను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారనీ, కరపత్రాలను సైతం పంచనివ్వలేదని వాపోయారు. కేటీఆర్ ను టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రిని చేయబోతున్నారనీ, అందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దమ్ముంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బ్యాలెట్ విధానంలో ఎన్నికలకు రావాలని సవాలు విసిరారు.