పెథాయ్ ఎఫెక్ట్.. కాకినాడ తీరంలో 28 మంది జాలర్ల గల్లంతు.. కుటుంబ సభ్యుల్లో టెన్షన్ టెన్షన్!
- నాలుగు బోట్లలో వెళ్లిన మత్స్యకారులు
- గాలింపు ప్రారంభించిన అధికారులు
- తుపాను ప్రభావంతో 23 మంది దుర్మరణం
దుమ్ములపేట, పర్లాపేట, ఉప్పలంకకు చెందిన 28 మంది జాలర్ల జాడ ప్రస్తుతం తెలియరావడం లేదు. కాగా, గల్లంతయిన జాలర్ల కోసం అధికారులు రంగంలోకి దిగి గాలింపును ప్రారంభించారు. అంతకుముందు సముద్రంలో ఓఎన్జీసీ రిగ్ వద్ద చిక్కుకున్న ఏడుగురు జాలర్లను అధికారులు కాపాడగలిగారు. కాగా, తమ కుటుంబ సభ్యుల జాడ తెలియకపోవడంలో మత్స్యకారుల కుటుంబాలు టెన్షన్ తో గడుపుతున్నారు.