ఏపీలో రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్.. ప్రకటించిన ఆషా
- 450 ఆసుపత్రులకు రూ.500 కోట్ల బకాయిలు
- చెల్లించే వరకు వైద్యం బంద్
- సేవలను నిలిపిస్తున్నట్టు ప్రకటించిన ‘ఆషా’
ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా అందించిన చికిత్సకు గాను 450 ఆసుపత్రులకు రూ.500 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని మురళీకృష్ణ తెలిపారు. నెల రోజుల్లోగా బకాయిలు చెల్లించాలని, లేకుంటే సేవలు నిలిపివేస్తామని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. అందుకనే రేపటి నుంచి సేవలను నిలిపివేస్తున్నట్టు చెప్పారు.