మొన్న మాట్లాడే తప్పు చేశా.. మళ్లీనా?: సర్వేపై లగడపాటి స్పందన
- కుటుంబ సమేతంగా తిరుమలకు లగడపాటి
- తిరుపతిలో రాజకీయాలు మాట్లాడనన్న మాజీ ఎంపీ
- ఆ రోజే మాట్లాడి తప్పు చేశానని పశ్చాత్తాపం
రాజకీయాల గురించి తిరుపతిలో మాట్లాడకూడదని అనుకుంటూనే మొన్న మాట్లాడేశానని, అదే పెద్ద పొరపాటైందని అన్నారు. నిజానికి తిరుపతిలో తానెప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడనని, కానీ మొన్న మీ అందరినీ చూసి ఆగలేక మాట్లాడేశానని అన్నారు. ఆ రోజు మాట్లాడడమే పొరపాటైందని, మళ్లీ ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించి మరో పొరపాటు చేయబోనని చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.