సీనియర్లకు పట్టం కట్టిన కాంగ్రెస్.. రాజస్తాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ నియామకం!
- మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్
- ఛత్తీస్ గఢ్ అభ్యర్థిపై త్వరలో నిర్ణయం
- సోనియా సూచనతో మనసు మార్చుకున్న రాహుల్
సీనియర్లను పక్కనపెట్టి యువ నేతలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఈసారి భావించారు. అయితే 2019 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఎన్నికల పోరుకు సిద్ధం చేసేందుకు సీనియర్ల అనుభవం పనికివస్తుందని యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ రాహుల్ కు సూచించారు. నిధుల సమీకరణ, ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి దూసుకుపోవడం కోసం సీనియర్ల సహకారం అవసరమని నచ్చజెప్పారు. దీంతో వెనక్కి తగ్గిన రాహుల్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ను రాజస్తాన్ సీఎం పదవికి, కమల్ నాథ్ ను మధ్యప్రదేశ్ సీఎం పదవికి ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఛత్తీస్ గఢ్ కు కాబోయే ముఖ్యమంత్రిని పార్టీ శ్రేణులతో చర్చించి నిర్ణయించనున్నారు.