చంద్రబాబు పిలుపు ఇవ్వగానే.. తెలంగాణ ప్రజలు టీడీపీని భూస్థాపితం చేశారు!: విజయసాయిరెడ్డి సెటైర్లు
- మూడు రాష్ట్రాల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ
- తన వల్లే గెలిచిందని వ్యాఖ్యానించిన ఏపీ సీఎం
- వ్యంగ్యంగా స్పందించిన విజయసాయిరెడ్డి
ఈరోజు ఫేస్ బుక్ లో సాయిరెడ్డి స్పందిస్తూ..‘నావల్లే 3 రాష్ట్రాల్లో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోయిందంటున్నాడు నాయుడు బాబు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆయన పిలుపిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో మార్మోగిందట. కానీ ఆ పిలుపుతో ఉలిక్కిపడిన తెలంగాణ ప్రజలు బాబు&కో ను ఎన్నికల్లో శాశ్వతంగా భూస్థాపితం చేశారు. బాబు అబద్ధాల నోటి తీట మారదు’ అని పోస్ట్ చేశారు.