జ్యోతిరాదిత్యకు నిరాశ... మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్ ఖరారు!
- సీఎం ఎంపిక బాధ్యతలు రాహుల్ పై
- ఏకగ్రీవ తీర్మానం చేసిన ఎమ్మెల్యేలు
- కమల్ నాథ్ ను ఎంపిక చేసిన రాహుల్
ఆపై రాహుల్, పలువురు ముఖ్య నాయకులతో మాట్లాడి, కమల్ నాథ్ పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్ లో సాధారణ మెజారిటీకి కాంగ్రెస్ రెండు స్థానాల దూరంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమల్ నాథ్ తన చతురతను ఉపయోగించి, ఏడుగురు బీజేపీయేతర ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ కన్నా ఐదుగురు ఎమ్మెల్యేల అధిక బలాన్ని కాంగ్రెస్ సంపాదించుకున్నట్లయింది. బహుజన సమాజ్ పార్టీ కూడా కాంగ్రెస్ కు మద్దతు పలికింది.