సుప్రీంకోర్టులోనూ టీడీపీకి షాక్.. మడకశిర ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి ప్రకటన!
- హైకోర్టు తీర్పును సమర్థించిన ధర్మాసనం
- తప్పుడు ఎన్నికల అఫిడవిట్ ఇచ్చారని వ్యాఖ్య
- వైసీపీ నేత ఎమ్మెల్యేగా కొనసాగుతారని స్పష్టీకరణ
కర్ణాటకలో ఉన్న రెండు కేసులతో పాటు కుటుంబానికి సంబంధించిన వివరాలను ఈరన్న ఎన్నికల అఫిడవిట్ లో చెప్పలేదని తిప్పేస్వామి హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు ఈరన్న ఎన్నిక చెల్లబోదని స్పష్టం చేసింది. దీంతో ఈరన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.