తెలంగాణ ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే పట్టం కట్టబోతున్నారని టైమ్స్ నౌ తెలిపింది. కాసేపటి క్రితం ఈ సంస్థ తన ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించింది. మొత్తం 119 స్థానాలకు గాను 66 స్థానాలను గెలుచుకుని, అతి పెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరిస్తుందని చెప్పింది. మహాకూటమి 37 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. బీజేపీ 7 స్థానాల్లో గెలుస్తుందని, ఇతరులు 9 స్థానాలను కైవసం చేసుకుంటారని చెప్పింది.