ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తున్న సొమ్మును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపక్కన పడేసిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తం సుమారు నాలుగు లక్షల వరకు ఉన్నట్టు సమాచారం.

కాగా, స్థానిక ఈదుల్ గూడ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఓ వ్యక్తి నుంచి రూ.47 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద ఉన్న సొమ్ముకు సంబంధించి ఎటువంటి ఆధారాలు అతను చూపించలేకపోయినట్టు పోలీసులు చెప్పారు.