తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు నాలుగు రోజులు కాదు.. ఐదు రోజులు!
Add ap7am to your home Screen

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు నాలుగు రోజులు కాదు.. ఐదు రోజులు!

  • ఓట్లు లెక్కించే మంగళవారం కూడా సెలవే
  • ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
  • వరుస సెలవులతో ఖుషీ
తెలంగాణలో శుక్రవారం ఎన్నికలు జరగనుండడంతో విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పోలింగ్ ఏర్పాట్లలో భాగంగా గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం శుక్రవారం ఓటింగ్ కావడంతో ఆ రోజు కూడా సెలవే.

ఇక శని, ఆదివారాలు సాధారణ సెలవులు. వరుసగా నాలుగు రోజుల సెలవుల తర్వాత సోమవారం తిరిగి విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. అయితే, మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఓట్లను లెక్కించే విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు మంగళవారం కూడా సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Telangana
Schools
Holidays
Elections
Polling

More Telugu News