కేసీఆర్ ఆలంపూర్ సభలో ఉపయోగించిన భాషపై మండిపడుతున్న కాంగ్రెస్
- అలంపూర్ బహిరంగ సభలో కేసీఆర్‌ను ప్రశ్నించిన ప్రజలు
- వేదికపై నుంచే కేసీఆర్ ఆగ్రహం
- భాష మార్చుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్
కేసీఆర్ తన పద్ధతిని మార్చుకోవాలని, ఆలంపూర్ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఓ వ్యక్తి ఇలా దిగజారి మాట్లాడడం ఏంటని, భాష మార్చుకోవాలని, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే మళ్లీ ఆలంపూర్‌లో అడుగుపెట్టలేవంటూ హెచ్చరించారు. ఇది దొరల పాలన కాదన్న సంగతిని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు.