ఇండోర్ హోటల్‌లో హిందూ యువతితో ముస్లిం యువకుడు.. పట్టుకున్న కర్ణిసేన

ఇండోర్ హోటల్‌లో హిందూ యువతితో ముస్లిం యువకుడు.. పట్టుకున్న కర్ణిసేన

Muslim man with Hindu girl in Indore hotel caught by Karni Sena
  • హిందూ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకుని మోసం చేశాడని ఆరోపణ
  • సమాచారం అందుకుని యువకుడిని పోలీసులకు అప్పగించిన హిందూ కార్యకర్తలు
  • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన విజయ్ నగర్ పోలీసులు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ హోటల్‌లో హిందూ యువతితో ఉన్న ముస్లిం యువకుడిని శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తన అసలు పేరు దాచి, హిందూ పేరుతో యువతిని మోసం చేశాడని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన సెప్టెంబర్ 5న చోటుచేసుకుంది.

హిందూ సంఘాల కార్యకర్తల కథనం ప్రకారం.. మణిక్‌బాగ్‌కు చెందిన అహద్ లకడియా అనే వ్యక్తి, తన పేరు రోషన్ అని చెప్పి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా యువతితో స్నేహం చేశాడు. అతడు మోమోస్ షాప్ నడుపుతూ, అక్కడికి వచ్చే యువతుల ఇన్‌స్టాగ్రామ్ ఐడీలు సేకరించి వారితో పరిచయాలు పెంచుకుంటాడని కార్యకర్తలు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆ యువతిని కూడా హోటల్‌కు రప్పించాడని తెలిపారు.

ఈ విషయంపై సమాచారం అందుకున్న కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర సింగ్ దీక్షిత్, ఇతర సభ్యులు వెంటనే హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ యువతితో ఉన్న అహద్ లకడియాను పట్టుకుని విజయ్ నగర్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

ఈ ఘటనపై ఏసీపీ పరాగ్ సైని స్పందించారు. అశోకా కాలనీ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. ప్రాథమికంగా ఇది ఇద్దరి మధ్య వివాదంగా కనిపిస్తోందని, ఘటన వెనుక అసలు కారణాలు, ఇతరుల ప్రమేయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ ఆరోపణలు, వివాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Advertisement
Ahad Lakadia
Karni Sena
Indore Hotel Incident
Identity Concealment Case
Madhya Pradesh Police
Instagram Fraud Case

More Telugu News