తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నందమూరి బాలకృష్ణకు ఎన్నికల సంఘం(ఈసీ) షాకిచ్చింది. ఈ రోజు జరగాల్సిన రోడ్ షో లో పాల్గొనేందుకు అనుమతిని నిరాకరించింది. దీంతో టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ఈ నెల 1 నుంచి బాలకృష్ణ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.

అయితే ఎన్నికల ప్రచారం నిర్వహించే వ్యక్తులు ఆ సమాచారాన్ని ఈసీకి 48 గంటలు ముందుగా ఇవ్వాలి. అయితే టీడీపీ శ్రేణులు ఈ విషయాన్ని మర్చిపోయాయి. దీంతో బాలయ్యకు షాక్ ఇస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. కాగా, ఎన్నికల కమిషన్ నిర్ణయం నేపథ్యంలో బాలయ్య ప్రచారానికి దూరం కానున్నారు.