కోదండరాం పెద్ద మూర్ఖుడు.. అందుకే మహాకూటమిలో చేరి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు!: కేసీఆర్
- మహాకూటమి ఓ మాయాకూటమే
- కోదండరాం పరిస్థితి దారుణంగా మారింది
- చంద్రబాబును ఇక్కడ విలన్ గా చూస్తున్నారు
కోదండరాం ఓ మూర్ఖుడనీ, అందుకే మహాకూటమిలో చేరి చాలాపెద్ద తప్పు చేశారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతల మూర్ఖత్వం కారణంగా చంద్రబాబును తీసుకొచ్చారన్నారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబును దూషిస్తారనీ, విలన్ గా భావిస్తారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని టీపీసీసీ నేతలు పొత్తు పెట్టుకుని తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ‘బహుబలి లాంటి మీ కటౌట్ ను నేను చూశాను. మీకు చాలా ప్రజాభిమానం ఉంది’ అని సర్దేశాయ్ చెప్పగా కేసీఆర్ ముసిముసి నవ్వులు నవ్వుతూ థ్యాంక్యూ అంటూ ఇంటర్వ్యూను ముగించారు.