రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయండి.. తెలంగాణ డీజీపీకి ఈసీ ఆదేశం!
- కోస్గీలో కేసీఆర్ ను అడ్డుకుంటామన్న రేవంత్
- ఈరోజు తెల్లవారుజామున అరెస్ట్ చేసిన పోలీసులు
- రేవంత్ మాయంకావడంపై హైకోర్టుకెళ్లిన కాంగ్రెస్
మరోవైపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ అరెస్టుపై హైకోర్టులో ప్రత్యేక లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని వెంటనే విడిచిపెట్టాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని రజత్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ పోలీసులు కోర్టుకు విన్నవించనున్నారు.