Rajasingh: ఓ కుక్క సవాలుకు ఇదే సమాధానం.. అక్బరుద్దీన్‌పై నిప్పులు చెరిగిన రాజాసింగ్

  • దమ్ముంటే తనతో కబడ్డీ ఆడేందుకు రావాలని సవాల్
  • మోదీ ఎన్ని సార్లయినా వస్తారు
  • అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్పు

ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌కు గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ సవాలు విసిరారు. ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దమ్ముంటే తనతో కబడ్డీ ఆడాలని సవాలు విసిరారు. సెక్యూరిటీని పక్కన పెట్టి ఐదు నిమిషాలు తనతో కబడ్డీ ఆడాలని చాలెంజ్ చేశారు.

మోదీ హైదరాబాద్ వచ్చి చూడాలని ఓ కుక్క సవాల్ చేసిందని, తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరైనా తమ కాళ్ల వద్దకే రావాల్సి ఉంటుందని మరో కుక్క మొరుగుతోందని రాజాసింగ్ అన్నారు. మోదీ ఒకటి రెండు సార్లు కాదని, ఎన్నిసార్లు అయినా వచ్చి వెళ్తారని రాజాసింగ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని తేల్చి చెప్పారు.

Rajasingh
Goshamahal
BJP
Akbaruddin Owaisi
MIM
  • Loading...

More Telugu News