చార్మినార్ దగ్గరకెళ్లి ‘నేనే ముఖ్యమంత్రిని’ అని కేసీఆర్ చెప్పగలడా?: సీపీఐ నేత నారాయణ
- ‘పాతబస్తీకి నేనే అధిపతిని’ అని కేసీఆర్ చెప్పగలడా?
- కేసీఆర్ కు సిగ్గుంటే కనుక అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండించాలి
- నాడు ‘మెట్రో’కు కేసీఆర్ వ్యతిరేకం
ఓల్డ్ సిటీకి ‘మెట్రో’ వస్తుందనే కేటీఆర్ చెబుతున్నారని, ఇంతవరకూ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ‘మెట్రో’కు ఓల్డ్ సిటీలో వాళ్లు వ్యతిరేకమని అన్నారు. ఇప్పుడేమో, ఓల్డ్ సిటీకి కూడా ‘మెట్రో’ వస్తుందని చెబుతున్నారని, ఎందుకంటే, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచేది లేదు కనుక అని విమర్శించారు. నాడు ‘మెట్రో’కు కేసీఆర్ వ్యతిరేకమని, నేడు ‘మెట్రో’కు ఎంఐఎం వ్యతిరేకమని, వీళ్లా హైదరాబాద్ సిటీని పెంచిపోషించేది, బాగు చేసేది? అంటూ ఆయన దుయ్యబట్టారు.