హిమాలయ ప్రాంతంలో భవిష్యతులో భారీ భూకంపం.. శాస్త్రవేత్తల హెచ్చరిక!
- తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.5 ఉంటుంది
- శాటిలైట్ చిత్రాల ఆధారంగా వెల్లడి
- ఎప్పుడైనా విపత్తు సంభవించే అవకాశం
బెంగళూరులోని జవహర్ లాల్ నెహ్రూ ఆధునిక శాస్త్రీయ పరిశోధన సంస్థకు చెందిన భూకంప శాస్త్రవేత్త సీపీ రాజేంద్రన్ ఈ పరిశోధన వివరాలు తెలిపారు. ఉత్తరాఖండ్ నుంచి పశ్చిమ నేపాల్ మధ్య భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ విపత్తు సంభవించే అవకాశముందని తాజా పరిశోధనల ఆధారంగా వెల్లడించారు. భూ పొరల్లో కదలికలు, ఘర్షణల ఫలితంగా తీవ్ర ఒత్తిడి నెలకొనడంతో ఈ విపత్తు సంభవించే అవకాశముందని తెలిపారు.